పతకాలు సాధించిన విద్యార్థులకు సత్కారం

UPDATED 15th FEBRUARY 2018 THURSDAY 8:00 PM

సామర్లకోట: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కరాటే పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన పలువురు విద్యార్దులు బంగారు, వెండి పతకాలు సాధించడంతో వారిని గురువారం ఘనంగా సత్కరించారు. దీనిలో భాగంగా ఏడు బంగారు పతకాలు, నాలుగు వెండి పతకాలను విద్యార్థులు సాధించారు. మొత్తంగా 11 పతకాలు సాధించిన సామర్లకోటకు ఛాంపియన్ షిప్ లభించినట్లు, అలాగే ఉత్తమ ప్రతిభ కనపరిచి అనేక బహుమతులు సాధించటం జరిగిందని లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మెంబర్, వైఎస్సార్ సీపీ టౌన్ సెక్రెటరీ సేపేని సురేష్, బి. సత్యనారాయణ, పట్టణ నాయకులు ఈదాల రుద్ర చౌదరి, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us