UPDATED 12th SEPTEMBER 2017 TUESDAY 7:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్ - 2017 పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచినట్లు కళాశాల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ నెల 9 , 10 తేదీల్లో సామర్లకోటలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్ లో ఈ అవార్డులు పొందినట్లు ఆయన పేర్కొన్నారు. 50 కేజీల విభాగంలో పి. పవన్ వర్మ, 60 కేజీల విభాగంలో సాయి శివ ప్రశాంత్, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారని అయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ఫిజికల్ డైరెక్టర్ తిరుమలరావు, తదితరులు అభినందించారు.







