సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

UPDATED 4th SEPTEMBER 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ వై. ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గల మెప్మా కార్యాలయంలో ఎస్ఎల్ఎఫ్, ఆర్పీలతో మంగళవారం నిర్వహించిన  సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. పట్టణాన్ని  ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, పేపర్ సంచులు, క్లాత్ సంచులు తయారీకి ఆసక్తి గల సభ్యులను గుర్తించి వారికి కావలసిన సదుపాయాలు కల్పించాలని సిఎంఎంను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు, రిసోర్స్ పర్సన్లు, సాధికార, బీమా, కల్యాణ మిత్రలు, మెప్మా సిబ్బంది, కె. సుధాకరరావు, నక్కా రత్నాకర్, ఐ.బి..శ్రీనివాస్, ఎల్.హెచ్. శివరామ్, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us