ఆదిత్యలో ఘనంగా జాతీయ యువజన దినోత్సవ వేడుకలు

UPDATED 12th JANUARY 2019 SATURDAY 7:00 PM

గండేపల్లి: భారతదేశ గొప్పతనం, శక్తి సామర్థ్యాలు, చారిత్రక ప్రస్థానాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కొద్ది మంది దేశభక్తుల్లో స్వామి వివేకానంద ఒకరని ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల  ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం స్వామి వివేకానంద చిత్రపటానికి ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ కెరటం నాకు ఆదర్శం..లేచి పడుతున్నందుకు కాదు..పడినా లేస్తునందుకు అంటూ దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన యువతరానికి తమ శక్తియుక్తులను తెలిపి కార్యోన్ముఖులను చేసిన తేజోమూర్తి స్వామీ వివేకానందని అన్నారు. మహాత్మాగాంధీ తర్వాత ప్రజల దృష్టిని ఆకర్షించిన వారిలో ఆయనది ప్రత్యేక స్థానమని, చిన్న వయసులోనే కాలం చేసినా ఉన్న తక్కువ కాలంలోనే జాతిని జాగృతం చేస్తూ తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న గొప్ప దేశభక్తుడని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్  ఎస్. రమాశ్రీ, హెడ్ ఆర్&డి డాక్టర్ కె.వి. శ్రీరామచంద్రమూర్తి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (సిఇ) జె. పవన్, గ్రంధాలయ శాఖ ప్రధానాధికారి కె. అశోక్, వివిధ విభాగాధిపతులు, శ్రీ శారదరామకృష్ణ సేవాసమితి (పెదబ్రహ్మదేవం) సభ్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us