జాతీయస్థాయి సాఫ్ట్ వేర్ గేమ్స్ పోటీలలో ఆదిత్య విద్యార్థుల ప్రతిభ

UPDATED 1st OCTOBER 2018 MONDAY 7:00 PM 

గండేపల్లి: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, కజని యూనివర్సిటీ ఆఫ్ అప్లయిడ్ సైన్సెస్(ఫిన్లాండ్) సహకారంతో ఈనెల 28 నుంచి 30 వరకు మూడురోజులపాటు స్థానిక ఆదిత్య విద్యాసంస్థల ప్రాంగణంలో ఇండియా గేమ్ సమ్మిట్- 2018 పేరిట నిర్వహించిన జాతీయస్థాయి సాఫ్ట్ వేర్ గేమ్స్ డెవలప్ మెంట్ పోటీలు ఆదివారం ముగిసినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఫిన్లాండ్ దేశానికి చెందిన సీనియర్ గేమ్ డెవలపర్ జోయెల్ పార్తమెన్ నేతృత్వంలో సాగిన ఈ పోటీలు ఎంతో విజ్ఞానదాయకంగా సాగాయని, మూడురోజులపాటు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. ఈ పోటీలలో తమ సంస్థ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో గౌతమి అండ్ టీమ్ ఆదిత్య (ప్రధమ), రవిశంకర్ అండ్ టీం (ద్వితీయ) స్థానాలు జాతీయస్థాయిలో 74 టీముల్లో గౌతమి అండ్ టీమ్ (ఆదిత్య) నాల్గవ స్థానం కైవసం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఫిన్లాండ్ కు చెందిన సీనియర్ గేమ్ డెవలపర్ శ్రీ జోయెల్ పార్తన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషనుకు చెందిన ఎం. సందీప్, బి. శివశంకర్, హరిప్రియ మన్నే సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలు విద్యార్థిలోని వినూత్న ఆలోచనలను వెలికితీసేందుకు వాటిని ద్విగుణీకృతం చేసేందుకు ఎంతో దోహదపడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, టి-హబ్ హెడ్ బాబ్జి నీలం, కళాశాల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెచ్. గౌతమ్, అధ్యాపక సిబ్బంది, 26 కళాశాలలకు చెందిన 150 మంది విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us