విద్యార్థులకు మున్సిపల్ కమీషనర్ అభినందనలు

UPDATED 17th MAY 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట పట్టణ పరిధిలో గల నాలుగు మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతిలో  ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మున్సిపల్ కమీషనర్ టి. నాగేంద్రకుమార్ అభినందించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన అభినందన సభలో మున్సిపల్ కమీషనర్ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ పదవతరగతి ఫలితాల్లో 98 శాతం ఉత్తీర్ణతతో స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల పట్టణ స్థాయిలో ప్రధమస్థానం సాధించడంతో పాటు విద్యార్థిని కె. పరాస్ కుమారి 10 జిపిఎ, ద్వితీయ స్థానాన్ని 95 శాతం ఉత్తీర్ణతతో యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్  ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు 10 జిపిఎ సాధించారన్నారు. బిబిఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల, యస్.జి.టి.కె పాఠశాలలో 83 శాతం ఉత్తీర్ణత సాధించగా, బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత  పాఠశాలలో 9 జిపిఎ పైగా సాధించిన విద్యార్థులు 24 మంది, వైఎయం ఉన్నత పాఠశాలలో 9 జిపిఎ పైగా సాధించిన విద్యార్థులు 14 మంది ఉన్నారని అన్నారు. 10 జిపిఎ సాధించిన కె. పరాస్ కుమారి, కె.యస్.యస్. శ్రీరామ్ కుమార్, ఏ. ఆశాజ్యోతి, 9.8 జిపిఎ సాధించిన బి. దేదీప్య, వి. సంతోష్, టి. స్వరూపారాణి, వి. రమ్య వినయని, యన్. మేఘనా దేవిలను ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయిరామకృష్ణ, యు. సత్యనారాయణ, ఆర్. శ్రీనివాస రాజు, టి. శ్యాంసుందర్, ఎ.ఇ. ప్రభాకరరావు, మేనేజరు అచ్యుతరాజు, యు.యల్.బి. కోఆర్డినేటర్, కె.ఎస్. శేఖరం, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us