Musharraf: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత!

Updated 5th February 2023 Sunday 11:59 am

Parvez Musharraf: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు (Parvez Musharraf) ముషారఫ్ కన్నుమూసినట్లు వార్తలొస్తున్నాయి. దుబాయ్ లోని ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. పా కిస్థాన్ (Pakistan) మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (Parvez Musharraf) (79) కన్నుమూసినట్లు దేశ వార్తాసంస్థలు కథనాలు వెలువరిస్తున్నాయి. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దుబాయ్ లోని అమెరికన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని ముషారఫ్ కుటుంబసభ్యులు ధ్రువీకరించినట్లు పాకిస్థాన్ కు చెందిన 'జియో న్యూస్' వెల్లడించింది.

దేశ విభజనకు ముందు 1943 ఆగస్టు 11న దిల్లీలో జన్మించిన ముషారఫ్.. దేశ విభజన తర్వాత కుటుంబంతో కలిసి పాకిస్థాన్కు వెళ్లిపోయారు. ఆ తర్వాత సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఆ దేశాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2001 నుంచి 2008వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అభిశంసనను తప్పించుకొనేందుకు తన పదవికి రాజీనామా చేశారు. పాక్ సైనికదళాల ప్రధానాధికారిగా పనిచేసిన ముషారఫ్.. 1999లో నవాజ్ షరీఫ్ సర్కార్ పై తిరుగుబాటు చేసి సైనిక పాలకుడిగా పగ్గాలు చేపట్టారు. రెండేళ్ల తర్వాత పాక్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కార్గిల్ యుద్ధానికి ముషారఫ్ ప్రధాన కారకుడు. 2016 నుంచి ఆయన దుబాయిలోనే ఆశ్రయం పొందుతున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us