మెప్మా పథకాలపై విస్తృత ప్రచారం కల్పించండి

UPDATED 5th OCTOBER 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: మెప్మా సంస్థ చేపడుతున్న పథకాలపై పట్టాన ప్రాంత మహిళా సమాఖ్యల్లో విస్తృత ప్రచారం కల్పించాలని మెప్మా రాష్ట్ర మిషన్ డైరెక్టర్ పి. చినతాతయ్య అన్నారు. స్థానిక టిటిడిసిలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మెప్మా సిబ్బందితో సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా మెప్మా పిడి ఉమామహేశ్వరావు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో చినతాతయ్య మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సమాఖ్యలకు అందించే పసుపు కుంకుమ పధకం ద్వారా అందచేస్తున్న ఆర్ధిక ప్రోత్సాహం ప్రతీ సభ్యురాలికి అందేలా చూడాల్సిన భాద్యత మెప్మా సిబ్బందిదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా మెప్మా పిడి ప్రమీల, ఆదినారాయణ, ప్రభావతి,  శ్రీను, జగదీష్, సుబ్రహ్మణ్యం, రంగాచారి, లక్ష్మీనారాయణ, పి.వెంకటలక్ష్మి, కె. సుధారాణి, పి. శైలజ, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us