UPDATED 4th JANUARY 2018 THURSDAY 9:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఫార్మసీ కళాశాల తృతీయ సంవత్సరం ఫార్మా-డి విద్యార్థులచే ఈ నెల ఐదవ తేదీన పెద్దాపురం మండలం గోరింట గ్రామంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు ఆదిత్య ఫార్మసీ కళాశాలల డైరెక్టర్ డాక్టర్ కె. రవిశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిబిరంలో రక్తపోటు నిర్ధారణ పరీక్షలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, బి.ఎం.ఐ., వాక్సిన్ల ప్రాముఖ్యత, పిల్లలకు నులిపురుగుల నివారణా మందులు, బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత, ప్రథమ చికిత్సలపై గ్రామస్థులకు అవగాహన కల్పించి అవసరమైన వారికి విటమిన్, ఐరన్ టాబ్లెట్స్ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.







