UPDATED 3rd DECEMBER 2017 SUNDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ లో గల ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపక సిబ్బందికి బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, బి.ఎం.ఎస్. కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ చే "అవుట్ కమ్స్ బేస్డ్ ఎడ్యుకేషన్" అంశంపై నిర్వహించిన రెండు రోజులు వర్క్ షాప్ ఆదివారంతో విజయవంతంగా ముగిసినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ ప్రొఫెసర్స్ డాక్టర్ కె. మల్లికార్జునబాబు, డాక్టర్ ఆర్.వి. రంగనాథ్, గురుప్రసాద్, శేషాచలం, ఆర్. సురేష్ కుమార్ లు "అవుట్ కమ్స్ బేస్డ్ ఎడ్యుకేషన్" పై తగు సూచనలు, సలహాలు, ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ నేటి ఇంజనీరింగ్ విద్యలో ఆధునిక విద్యావిధానం, వేగంగా మారుతున్న టెక్నాలజీ విద్యార్థులకు సవివరంగా అందించే విధానాలు గురించి ఈ వర్క్ షాప్ లో చర్చించడం జరిగిందని ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్. వివిధ శాఖల విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.







