రైతులకు మరింత సాంకేతిక విజ్ఞానం అందించాలి

*  ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప

UPDATED 30th MAY 2020 SATURDAY 6:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): రైతులకు మరింత సాంకేతిక విజ్ఞానం అందించాలని పెద్దాపురం ఎమ్మెల్యే  నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక పాండవులమెట్టపై ఉన్న రైతు శిక్షణా కేంద్రాన్ని, రైతు భరోసా విజ్ఞాన కేంద్రంతో అనుసంధానం చేస్తూ మార్పు చేసిన డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ ను శనివారం ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ ముఖ్య ఉద్దేశ్యాలను రైతు భరోసా విజ్ఞాన కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్ సునీతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలలో రైతులకు సాంకేతిక విజ్ఞానాన్ని అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆర్ బికె పరిధిలోని స్టాక్ హోల్డర్స్ అందరికీ వ్యవసాయ అనుబంధ రంగాల వారీగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల వారీగా వ్యవసాయ అనుబంధ రంగాల శిక్షణా క్యాలెండర్ తయారు చేయడం, వివిధ ఆర్ బికె కేంద్రాలలో ఉన్న స్మార్ట్ టీవీల ద్వారా డిఆర్సీ తో అనుసంధానమవుతూ ఆన్-లైన్, ఆఫ్-లైన్ లలో శాస్త్రీయ విజ్ఞానాన్ని అందిస్తాయని అన్నారు. డిఆర్సీలు జిల్లాలోని 1129 రైతు భరోసా కేంద్రాలతో పొందే విధంగా రైతులకు సరైన సాంకేతిక సమాచారాన్ని చేరవేసే విధంగా పనిచేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షణా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ నాగాచారి, ఏడీఏ రత్నప్రశాంతి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, వ్యవసాయ శాఖ అధికారులు, డిఆర్సీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.              

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us