ఆదిత్యలో స్టేట్ స్కిల్స్ కాంపిటేషన్స్

UPDATED 9th MARCH 2020 MONDAY 8:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో  ఎ.పి.ఎస్.ఎస్.డి.సి సౌజన్యంతో స్టేట్ స్కిల్స్ కాంపిటేషన్స్-2020 నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జోనల్ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో భాగంగా  విద్యార్థులకు శీతలీకరణ, కండిషనింగ్ వాణిజ్యంపై రెండు రోజుల శిక్షణ ఇచ్చి వారిలో గల నైపుణ్యాలను పరీక్షించడం జరిగిందని అన్నారు. అలాగే ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ధృవపత్రాలు అందచేశామని, ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంనేందుకు అర్హత సాధిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమం ఇంఛార్జ్ కె.వెంకటరెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ వి. శ్రీనివాసరావు, స్టూడెంట్స్ ఎఫైర్స్ డీన్ ప్రొఫెసర్ జె.డి. వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us