వరదలు ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి

* ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య 

UPDATED 8th JUNE 2020 MONDAY 6:00 PM

రంపచోడవరం (రెడ్ బీ న్యూస్): గోదావరి వరదలను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సబ్-కలెక్టర్, ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో గోదావరి వరదల విపత్తుల ప్రణాళికలు వరద సహాయక చర్యల్లో గతంలో విధులు నిర్వర్తించిన సెక్టారు అధికారుల అనుభవాలు తెలుసుకొని రాబోయే వరదలు ఏవిధంగా ఎదుర్కోనాలనే అంశాలపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కన్నా గోదావరి ప్రస్తుతం కాఫరు డాం నిర్మాణం మూలంగా కొద్దిపాటి వరదలు సంభవించేనాటికే దేవీపట్నం మండలంలో పలు గ్రామాలు ముంపుబారిన పడుతున్నాయని, కాంటూరు స్థాయి ప్రకారం వరదలు వచ్చే స్థాయిలలో చాలా వ్యత్యాసాలు ఉన్నట్లు జలవనరుల శాఖ నివేదికలు రూపొందించిందన్నారు. భద్రాచలం, కూనవరం, ధవళేశ్వరంలలో వరదలకు అనుగుణంగా దేవీపట్నం మండలంలో ఏయే స్థాయిలలో ఏయే గ్రామాలు ముంపునకు గురవుతాయో నివేదికను తయారు చేసిందని, దాని ప్రకారం సెక్టారు అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. ఐదు సెక్టార్లులో నియమించబడిన సిబ్బందికి ముంపు ప్రణాళికలపై పూర్తి అవగాహన కలిగి ఏఏస్థాయిలో ఎన్ని గ్రామాలలో ఖాళీ చేయించాలో ఆ ప్రకారం సహాయక చర్యలు తీసుకోవాలన్నారు. జలవనరుల శాఖ అధికారులు వరదలు స్థాయిలకు అనుగుణంగా వివరాలు వాట్సాప్ లో సెక్టారు అధికారులకు తెలపాలన్నారు. గత వరదలలో విధులు నిర్వహించిన బోట్ యాజమానులకు, జనరేటర్ల ఏర్పాటుకు సంబంధించిన బకాయిలు చెల్లింపులు కోసం జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టారు అధికారులు నాగ వెంకట పద్మనాభం, వై. లక్ష్మయ్యబాబు, వై. సత్యనారాయణ, ఎస్. దైవకుమార్, ఎడిసి సుధాకరరాజు, డివిజనల్ పంచాయతీ అధికారి ఎన్. హరి, ట్రాన్సుకో ఎడిఈ కృష్ణంరాజు, తహసీల్దార్లు వీర్రాజు, ఆర్. వెంటేశ్వరరావు, జలవనరుల శాఖ అధికారి విజయ కుమార్, బోట్ సర్వేయరు వర్మ, బోట్ల యాజమానులు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us