UPDATED 25th JUNE 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: పట్టణంలోని పలు ప్రాంతాల్లో, అలాగే సామర్లకోట నుంచి కాకినాడ వెళ్లే ముఖ్య ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను పోలీసులు సోమవారం ఏర్పాటు చేశారు. పెద్దాపురం సిఐ వై.ఆర్.కె. శ్రీనివాస్, సామర్లకోట ఎస్సై ఎల్. శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి వీటిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.







