36 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి

అమరావతి (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: రాష్ట్రంలో 36 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా అదనపు ఎస్పీలుగా పదోన్నతులు పొందిన వారిలో అయిదుగురు అధికారులు సి.జయరామరాజు, ఈ.నాగేంద్రుడు, ఏ.వి.సుబ్బరాజు, కె.శ్రీలక్ష్మీ, జి.స్వరూపారాణి ఇప్పటికే అడహక్‌ ప్రాతిపదికన అదనపు ఎస్పీలుగా కొనసాగుతున్నారు. తాజాగా వారికి పూర్తి స్థాయి పదోన్నతి లభించింది. వీరందరినీ పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. మిగతా 31 మంది డీఎస్పీలు 15 రోజుల్లోగా పదోన్నతి పొందిన హోదాలోని పోస్టుల్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ఇన్‌ఛార్జి ముఖ్య కార్యదర్శి జి.విజయ్‌ కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us