UPDATED 26th JUNE 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ ఎల్. శివకుమార్ అన్నారు. సామర్లకోట మండలం పనసపాడు, పవర గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అడంగల్ సవరణకు రెండు దరఖాస్తులు స్వీకరించామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ భూములు వర్గీకరణ సక్రమంగా జరిగిందో లేదో చూసుకోవాలని, అలాగే చుక్కల భూములు వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ ప్రసాద్, ఆయా గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.







