UPDATED 11th AUGUST 2017 FRIDAY 7:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఆగస్ట్ 12 వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కళాశాల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ప్రతీ సంవత్సరం ఆగస్ట్ 12 వ తేదీన యువజన దినోత్సవాన్ని జరుపుకుంటామని, ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ సంస్థ " యూత్ సర్వీసెస్" సౌజన్యంతో ప్రభుత్వం "యూత్ బిల్డింగ్ పీస్" అనే థీమ్ తో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఉదయం 2 కె రన్ అనంతరం వక్తృత్వ, వ్యాసరచన, డ్రాయింగ్, చిత్రలేఖనం, ప్యానల్ డిస్కషన్, పలు కార్యక్రమాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశం లో కళాశాల ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాసరావు, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, గంధాలయాధికారి కె. అశోక్ కుమార్, తదితరులు పాల్గొన్నారు .







