* ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాకుర్తి రాంబాబు
UPDATED 18th JULY 2020 SATURDAY 6:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా గుర్తించి భీమా సౌకర్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాకుర్తి రాంబాబు డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కోర్కెల దినం కార్యక్రమాన్ని స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద పాత్రికేయులు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు మించి విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు రూ.50 లక్షలు భీమా వర్తింపచేయాలని అన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ డీటీ రామ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు అడపా వెంకట్రావు, రెడ్డిపల్లి రమణమూర్తి ఉప్పలపాటి చంద్రదాస్, పెమ్మాడి వీరభద్రవర్మ, బూరాడ శ్రీనివాసరావు, ఇర్షాద్ ఆలీ, వినాయక్, పచ్చాకుల లోవరాజు, చవ్వాకుల ఈశ్వరరావు, రాయవరపు వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.







