UPDATED 29th JULY 2019 MONDAY 7:00 PM
పెద్దాపురం: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నామమాత్రపు రుసుం ఒక్క రూపాయితో పంటల భీమాకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు మండల వ్యవసాయాధికారిణి కొల్లి ద్వారకాదేవి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో పండించిన పంటలు నష్టపోవడం వల్ల రైతులు ఆర్థికంగా అప్పుల పాలవుతున్నారని, గతంలో రైతులు ఎకరానికి రూ.30వేలు భీమాకు రెండు శాతం చొప్పున రూ. ఆరు వందలు చెల్లించేవారని, ప్రస్తుతం ఈ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించేందుకు నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. రుణాలు తీసుకునే రైతులందరూ తమ పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నకళ్ళతో సమీపంలో గల మీసేవా కేంద్రాల్లో ఒక్క రూపాయి చెల్లించి పంటల భీమాను ఆగష్టు నెల 21వ తేదీలోగా చేయించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.







