UPDATED 3rd JULY 2020 FRIDAY 6:30 PM
పెద్దాపురం( రెడ్ బీ న్యూస్) : పెద్దాపురం మండల వ్యవసాయ అధికారిణిగా ఎన్. ప్రశాంతి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. సామర్లకోట భూసార పరీక్షా కేంద్రంలో పనిచేస్తూ చేస్తూ బదిలీపై ఆమె ఇక్కడకు వచ్చారు. ఇంతవరకూ ఇక్కడ ఏవోగా పని చేసిన కొల్లి ద్వారకాదేవి కాకినాడ (సీడ్స్) విభాగానికి బదిలీపై వెళ్లారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె ఏడీఏ ఎం. రత్న ప్రశాంతిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.







