నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

అమరావతి:26 డిసెంబర్ 2020(రెడ్ బీ న్యూస్): నివర్‌ తుఫాన్‌, ఇతర విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. 28న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించనున్నట్టు వెల్లడించారు. రైతులను ఆదుకోవాలంటూ ఈ నెల 28న కృష్ణా జిల్లా కలెక్టర్‌కు పవన్ కల్యాణ్ వినతిపత్రం ఇస్తారని తెలిపారు. 17 లక్షల పైగా ఎకరాల్లో రైతులు పంట నష్టపోతే 7 లక్షల మందికి మాత్రమే పరిహారం అందించేలా కేబినెట్ తీర్మానం చేయడం అన్యాయమని మనోహర్ దుయ్యబట్టారు. తుఫానుతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని తప్పబట్టారు. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఎకరాకు రూ.35వేల ఆర్థికసాయం, తక్షణ సాయంగా రూ.10వేలు అందించాలని మనోహర్ డిమాండ్ చేశారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us