UPDATED 14th AUGUST 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు తోట వాణి పుట్టినరోజు వేడుకలు కాకినాడలోని ఆమె స్వగృహంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేయించి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాటూరి జానకిరామయ్య, భావన్నారాయణ, పుట్టా సూరిబాబు, వల్లూరి సత్యేంద్రకుమార్, కొండపల్లి శ్రీను, ఎలిజిబెత్ రాణి, మోటూరి సతీష్, తదితరులు పాల్గొన్నారు.







