జాతీయస్థాయి జూడో పోటీలకు ఆదిత్య విద్యార్థిని ఎంపిక

UPDATED 17th OCTOBER 2017 TUESDAY 5:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో బిబిఎ ప్రథమ సంవత్సరం చదువుతున్న హెచ్. సాయిసత్య జాతీయస్థాయి జూడో పోటీలకు ఎంపికైనట్లు బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ నెల 13 న ఆదికవి నన్నయ యూనివర్సిటీ నిర్వహించిన పోటీల్లో తమ కళాశాల విద్యార్థిని విశేష ప్రతిభ కనబరచడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఆమె పేర్కొన్నారు. తమ కళాశాల విద్యార్థులు అన్ని రంగాల్లో నైపుణ్యం సాధించాలనే ఉద్దేశ్యంతో క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను, క్రీడల్లో మంచి శిక్షణను ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినిని ప్రిన్సిపాల్ డాక్టర్ విశాలాక్షి, ఫిజికల్ డైరెక్టర్ భవాని, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us