యోగాసాధన జీవన విధానం కావాలి

UPDATED 21st JUNE 2018 THURSDAY 11:30 AM

పెద్దాపురం: యోగసాధన దైనందిన జీవితంలో భాగం కావాలని మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అన్నారు. స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ ఇండోర్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ శరీరమే సకల ఔషధాలకు నిలయమని, శ్వాసక్రియ నియంత్రణ ద్వారా శరీరంలోని అంతర్గత వ్యవస్థను ఉత్తేజితం చేసి, పంచకోశాలను అదుపులోకి తెచ్చుకునే అద్భుతమైన యోగశాస్త్ర విధానానికి మనదేశం పుట్టినిల్లు అన్నారు. యోగసాధన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందన్నారు. యోగసాధన ద్వారా నాడీమండలం ఉత్తేజితమవుతుందని, రోజూ అరగంట సేపు యోగసాధన చేయడం  ద్వారా వైద్యశాలలకు శాశ్వతంగా దూరంగా ఉండవచ్చన్నారు. విద్యార్థి దశలోనే యోగాభ్యాసాన్ని అలవర్చుకోవాలని, విద్యార్థులు యోగాసనాలు అలవాటు చేసుకొంటే మానసిక ఒత్తిడిని అధిగమించి ఏకాగ్రత సాధించవచ్చన్నారు. అందుకే ప్రతీ సంవత్సరం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్దీవో ఎన్.ఎస్.వి.బి. వసంత రాయుడు, తహసీల్దార్ జి. బాలసుబ్రహ్మణ్యం, ఎంపిడివో పి. వసంత మాధవి, చీఫ్ ఆపరేషన్ ఆఫీసర్ లెఫ్టినంట్ కమాండర్ కె. ఎస్. రావు, రిటైర్డ్ డిఎస్పీ సుధాకర్, మున్సిపల్ మేనేజర్ ప్రసాద్, పతంజలి యోగా సమితి సభ్యులు రాపాక ప్రసాద్, శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ ఎన్.సి.సి టీచర్ సతీష్, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.        

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us