UPDATED 4th SEPTEMBER 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట (రెడ్ బీ న్యూస్): సామర్లకోట మండలం నుంచి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా హుస్సేన్ పురం నెంబర్ 2 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్. అబ్దుల్ సత్తార్ ఎంపికయ్యారు. అలాగే మండల స్థాయిలో మేడపాడు కాంప్లెక్స్ నుంచి బిక్కిన ఉమామహేశ్వరి, వేట్లపాలెం కాంప్లెక్స్ నుంచి పద్మజా క్రాంతి, మాధవపట్నం కాంప్లెక్స్ నుంచి దొడ్డి సత్యవేణి, నవర కాంప్లెక్స్ లోని చంద్రంపాలెం నుంచి అచ్చియ్య ఎంపికయ్యారు. ఈనెల ఐదవ తేదీన కాకినాడ జెఎన్టీయులో జరిగే గురుపూజోత్సవ సభలో జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి చేతులమీదుగా వారు అవార్డులు అందుకోనున్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారిణి ఎస్. విజయలక్ష్మి, పలువురు ఉపాధ్యాయులు, తదితరులు వారిని అభినందించారు.







