నవరత్నాల అమలుతో స్వర్ణాంధ్రప్రదేశ్‌

UPDATED 5th OCTOBER 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు అమలు చేస్తే రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుతుందని పెద్దాపురం నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు అన్నారు. పార్టీ శ్రేణులు పట్టణ పరిధిలోని 20, 21 వార్డుల్లో రావాలి జగన్‌..కావాలి జగన్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు నవరత్నాల్లోని ఒక్కొక్క పథకాన్ని వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా సుబ్బారావు నాయుడు మాట్లాడుతూ ఆరు నెలలు ఓపిక పడితే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన వస్తుందని, అప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశీస్సులతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, పార్టీలకు, కులమతాలకతీతంగా ప్రజలంతా సంతోషించేలా మంచి కార్యక్రమాలు, పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మద్దాల శ్రీనివాస్, ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ల లక్ష్మీనారాయణ, నేతల హరిబాబు, మేకా శ్రీను, సేపేని సురేష్, శెట్టిబత్తుల దుర్గ, కానుబోయిన విజయకృష్ణ, మముట్టి రమణ, లింగం శివ, రెడ్డి శ్రీను, కమల్ రాజ్, పిల్లా సురేష్, చిట్టిమాని  శ్రీనివాస్, గంప శివ, గోపు మురళీ, పాఠంశెట్టి రాఘవ, మేడిశెట్టి భద్రం, తాటికొండ అచ్చిరాజు, కంటే వీరాఘవులు, సారంపాటి లోవచారి, పుట్టా సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us