ఒడియా రచయిత హృషికేష్‌కు పురస్కారం

భువనేశ్వర్‌, రెడ్ బీ న్యూస్ 31 డిసెంబర్ 2021: ప్రముఖ ఒడియా రచయిత హృషికేష్‌ మల్లిక్‌కు 2021వ సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. ఆయన రచించిన సొరిజయితిబా ఒపేరా (ముగిసిన నాటకం) పుస్తకానికి గురువారం ఈ అవార్డు ప్రకటించారు. ఆంగ్లంలో ప్రముఖ రచయిత్రి నమిత గోఖలే (ధింగ్స్‌ టు లీవ్‌ బిహెండ్‌’ నవల), హిందీలో దయా ప్రకాశ్‌ సిన్హా, కన్నడంలో డి.ఎస్‌.నాగభూషణ, తమిళంలో అంబాయ్‌ రచనలకు పురస్కారాలు ఇచ్చారు. బెంగాలీలో తృణమూల్‌ ఎమ్మెల్యే బ్రత్య బసు రాసిన నాటకానికి అవార్డు లభించడం విశేషం.

మొదటి పుస్తకానికే పురస్కారం ..

ఆంగ్లంలో సాహిత్య అకాడమీ యువ పురస్కారం మేఘా మంజుదార్‌కు లభించింది. ఆమె చేసిన తొలి రచనే ఈ ఘనత సాధించింది. ‘ఎ బర్నింగ్‌’ పేరుతో గత ఏడాదే ఆమె పుస్తకాన్ని ప్రచురించారు. భారత్‌లో జన్మించిన ఆమె ప్రస్తుతం కాలిఫోర్నియోలో నివసిస్తున్నారు. ఆంగ్లంలో బాల సాహిత్య పురస్కారం అనిత వచ్చరజనికి ప్రకటించారు. ‘అమృత షేర్‌గిల్‌: రెబెల్‌ విత్‌ ఎ పెయింట్‌ బ్రష్‌’ అన్న పుస్తకానికి అవార్డు లభించింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us