యువత అన్ని రంగాల్లో ఆధునిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలి

UPDATED 5th FEBRUARY 2019 TUESDAY 5:30 PM

గండేపల్లి: నేటి యువత అన్ని రంగాల్లో ఆధునిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, వారిని రేపటి భవిష్యత్ నిర్మాతలుగా తీర్చిదిద్దడం మన బాధ్యతని ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల, వరల్డ్ యూత్ ఛేంజ్ మేకర్స్ సంయుక్త ఆధ్వర్యంలో కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులకు విద్యా జీవనంలో ఆధునిక గమ్యాలు అనే అంశంపై మంగళవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ నేటి యువత కోపం, భయం, ఆతృత మొదలైన భావోద్వేగాలను నియంత్రించుకుని జ్ఞాపకశక్తిని పెంపొందించుకొంటూ ఆలోచనా విధానాలు పెంపొందించడమే నేటి కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఈ సదస్సుకు వరల్డ్ యూత్ ఛేంజ్ మేకర్స్ ఆర్గనైజేషన్ కు చెందిన ఉమాపతి, సునీల్ వక్తలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.శంభుప్రసాద్ మాట్లాడుతూ నేటి జీవన విధానంలో విద్యాజీవనం అనేది ఎంతో ముఖ్యమని, అది విద్యార్థులు, అధ్యాపకులకు నూతన గమ్యాలు ఏర్పరుస్తుందని పేర్కొన్నారు. మూడు గంటల పాటు నిర్వహించిన ఈ సదస్సులో వక్తలు మాట్లాడుతూ పూర్తి వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన మెడిటేషన్ విలువల గురించి తెలియచేశారు. నేటి యువతను దేశానికి వెన్నుముకగా, దేశంలో మంచి ఆరోగ్య వాతావరణాన్ని తయారుచేయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, డైరక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్  కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, డీన్ ఆర్&డి డాక్టర్ పి.వి.యస్. మాచిరాజు, వివిధ విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, అధ్యాపకులు, కార్యక్రమ కోఆర్డినేటర్లు వి. ప్రశాంత్, పి. రాజశేఖర ఫణీంద్ర, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us