మాట్-2018 లో ఆదిత్య గ్లోబల్ విద్యార్థుల ప్రతిభ

UPDATED 13th MARCH 2018 TUESDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ విద్యార్థులు మాట్-2018 లో విశేష ప్రతిభ కనబరిచి మంచి ఫలితాలు సాధించినట్లు డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఆల్ ఇండియా మేనేజ్మంట్ అసోసియేషన్ ఎంబిఎ, పిజిడిఎం కోర్సులలో ప్రవేశం కొరకు అఖిల భారత స్థాయిలో నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన ప్రవేశ పరీక్ష మాట్-2018 లో తమ కళాశాల విద్యార్థులు పి. గణేష్ వర్మ 96.6%, బి. కె. సాయి కౌసల్య 89.25%, డి.లక్ష్మీనారాయణ 87.50% మార్కులు సాధించునట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి , ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, అధ్యాపకులు, తదితరులు అభినందించారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us