శ్రీకాకుళం (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు నివాసం ఆవరణలో పాము కలకలం రేపింది. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రహదారిలో ఉన్న రామ్మోహన్ ఇంటి ప్రాంగణంలోకి అత్యంత విషపూరితమైన రక్తపింజర పాము చొరబడింది. పాము భయంకరంగా బుసలు కొడుతూ కనిపించడంతో ఎంపీ నివాస సిబ్బంది హడలిపోయారు. గ్రీన్ మెర్సీ స్నేక్ హెల్ప్ లైన్‌కు సమాచారం ఇవ్వడంతో.. హెల్ప్ లైన్ నిర్వాహకులు ఎంపీ ఇంటికి చేరుకొని పామును చాకచక్యంగా బంధించారు. అటవీశాఖ అధికారి సూచన మేరకు సమీపంలోని రిజర్వు అటవీ ప్రాంతంలో పామును విడిచిపెట్టారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







