UPDATED 11th APRIL 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: రజకుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రజక సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. సంఘ నాయకులు గోల్తి సత్యన్నారాయణ తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ వివిధ వీధుల మీదుగా కొనసాగి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొంది. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ రజకులను ఎస్.సిలుగా గుర్తించి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వర్తింపచేయాలని, యాభై సంవత్సరాలు నిండిన రజకులకు రెండు వేల రూపాయల పింఛను ఇవ్వాలన్నారు. వృత్తి చెరువులపై లీజులు రద్దు చేసి చట్టబద్ధత చేయాలని, రజకులకు రాజకీయ రిజర్వేషన్లు అమలుచేయాలని, దోబీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్ ఎల్. శివకుమార్ కు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రజకులు పాల్గొన్నారు.







