గైట్ లో ఘనంగా ముగిసిన మైత్రి 2కె19

* గేమ్స్& స్పోర్ట్స్ ఆల్ రౌండ్ ఛాంపియన్ గా గైట్
* మైత్రి వేదికపై భారత సైనికులకు సెల్యూట్ చేసిన ఆఫ్రికన్ విద్యార్థులు

UPDATED 2nd MARCH 2019 SATURDAY 10:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల (గైట్)లో రెండు రోజులపాటు నిర్వహించిన మైత్రి 2కె19 క్రీడా సాంస్కృతిక పోటీలు శనివారం ఘనంగా ముగిసాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మీ శశివర్మ పాల్గొని మైత్రి 2కె19 ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ క్రీడా, సాంస్కృతిక పోటీలలో విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందచేశారు. గేమ్స్& స్పోర్ట్స్ ఆల్ రౌండ్ ఛాంపియన్ షిప్ పురుషుల విభాగంలో గైట్ అటానమస్ కళాశాలకు, మహిళల విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ విష్ణు మహిళా ఇంజనీరింగ్ కళాశాలకు లభించినట్లు మైత్రి 2కె19 క్రీడల కన్వీనర్ డాక్టర్ సి. మంజ్రేకర్ హెన్రీ తెలిపారు. గైట్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నఆఫ్రికన్ దేశాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు వందేమాతరం గీతాలాపన ఆలపిస్తూ భారత సైనికులకు సెల్యూట్ చేశారు. అనంతరం హైదరాబాదుకు చెందిన నిర్మాణ్ బృందం పలు సినీగీతాలు ఆలపించగా, వాటికి అనుగుణంగా విద్యార్థులు హుషారుగా నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా గైట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శశికిరణ్‌వర్మ మాట్లాడుతూ తమ లక్ష్యాలను సాధించుకునేందుకు నిరంతరం తపనపడే విద్యార్థులకు మైత్రి మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందించిందని, నిత్యం పాఠ్యాంశాలతో తలమునకలై ఉండే విద్యార్థులకు మైత్రి ఒక ఆటవిడుపుగా నిలిచిందని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న వివిధ రకాల నైపుణ్యాలను బయటపెట్టేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మీ శశివర్మ, చైతన్య విద్యా సంస్థల సీఈవో డాక్టర్ డీఎల్‌ఎన్‌ రాజు, గైట్ జనరల్‌ మేనేజర్‌ డాక్టర్  పి. సుబ్బరాజు, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టివీప్రసాద్, డాక్టర్ ఎస్ఎస్ఎన్ రాజు, డాక్టర్ పిజి రామానుజం, డాక్టర్ పిఎంఎంఎస్ శర్మ, డాక్టర్ ఎండి ధనరాజు, కె. వల్లీమాధవి, మైత్రి 2కె19 కోఆర్డినేటర్లు డాక్టర్ సిఎం. హెన్రీ, డాక్టర్ వి. కుసుమకుమారి, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us