విద్యార్థినులకు నగదు పురస్కారం అందజేత

UPDATED 17th AUGUST 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో 10 /10 జిపిఎ సాధించిన విద్యార్థినులు ఎ. వెంకటదివ్య, ఎన్.వి.వి. రమణి, ఐ. కీర్తిప్రియలకు రిటైర్డ్ హెచ్ఎం పిల్లా భీమశంకరం ఒక్కొక్కరికి రూ. ఐదు వేలు వంతున నగదు ప్రోత్సాహాన్ని అందచేశారు. పాఠశాల హెచ్ఎం సి.హెచ్.ఎన్.ఆర్. శిరీష అధ్యక్షతన జరిగిన పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం హాజరై విదార్థినులను ఘనంగా సత్కరించి నగదు పురస్కారాన్ని అందచేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పద్మనాభం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పదికి పది జిపిఎ సాధించడం చాలా సంతోషకరమని, అలాగే ప్రభుత్వ పాఠశాలలు ఇంకా ఎంతో అభివృద్ధి సాధించాలని అన్నారు. కార్పోరేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాల విద్య చాలా గొప్పదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుసుకోవాలని, విద్యార్థులు కష్టపడి చదివితే అనుకున్నది సాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానవ హక్కుల పరిరక్షణా సంఘం జిల్లా అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, జుత్తుక అప్పారావు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us