UPDATED 3rd MAY 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: వర్ల రామయ్యకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వడం హర్షణీయమని ఎం.ఎం.జె.ఎస్ నాయకులు అన్నారు. స్థానిక భీమవరం కొత్తపేట మాదిగ మహాజన సంఘం జిల్లా అధ్యక్షుడు కాపవరపు కుమార్ స్వగృహంలో గురువారం సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ వర్ల రామయ్యకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వడం చాలా సంతోషమని, ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నామన రాంబాబుకు ఇరిగేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం కూడా సంతోషమని, సామాజిక న్యాయం కోరుకునే వీరిరువురికి ఉన్నతమైన పదవులు ఇవ్వడం సమాజానికి శ్రేయస్సు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎం.జె.ఎస్ నాయకులు టి. రాజేష్, గంధం చిన్నబ్బాయి, చెవ్వేటి కొండలరావు, మిరియాల మోసేబు, మందపల్లి రాజు, కాపవరపు జాన్, శ్రీమంతుల మరియమ్మ, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.







