రూ. రెండు లక్షలు విలువైన ఆభరణాల బ్యాగ్ అప్పగించిన ఆర్పీఎఫ్ పోలీసులు

UPDATED 12th MARCH 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ జి-18 బోగీ, బెర్త్ నెంబర్ ఐదులో ప్రయాణిస్తున్న సంధ్యాచరణ్ అనే ప్రయాకురాలు తన రూ. రెండు లక్షలు విలువైన ఆభరణాలు గల బ్యాగ్ ను సీట్లో మర్చిపోయి రాజమండ్రి రైల్వే స్టేషన్ లో దిగిపోయారు. అప్పటికే ట్రైన్ స్టేషన్ దాటిపోవడంతో రాజమండ్రి ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సామర్లకోట ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. సామర్లకోట ఆర్పీఎఫ్ పోలీసులు అబ్దుల్లా సీటులో మర్చిపోయిన బ్యాగ్ స్వాధీనం చేసుకున్నారు. ఆర్పీఎఫ్ ఎఎస్ఐ శ్రీరమణ, తుని ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరావు, అబ్దుల్లాల సమక్షంలో బాధితురాలు సంధ్యాచరణ్ కు బ్యాగ్ ను అందచేశారు. ఈ బ్యాగ్ లో రూ.6100 నగదు, విలువైన ఆభరణాలు ఉన్నాయని తెలిపారు. సకాలంలో స్పందించి తన బ్యాగ్ తనకు అందించిన రైల్వే పోలీసులకు సంధ్యాచరణ్ దంపతులు  కృతజ్ఞతలు తెలియచేశారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us