UPDATED 29th JULY 2018 SUNDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ లో ఈ నెల 31న ప్రముఖ కంపెనీ ఎల్&టి ఇన్ఫోటెక్ లిమిటెడ్ వారిచే ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈనెల 31, ఆగష్టు నెల ఒకటవ తేదీలలో రెండురోజులు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభ గల అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని, బి.టెక్/ఎంటెక్, ఎంఎస్సీ 2017, 2018 విద్యాసంవత్సరంలో బి.టెక్/ఎంటెక్ పెట్రోలియం, రిమోట్ సెన్సింగ్, ఆయిల్ & గ్యాస్ సంబంధిత శాఖలు, ఎంఎస్సీ భూగర్భశాస్త్రం, అప్లైడ్ జియాలజీ, జియో ఫిజిక్స్, అప్లైడ్ జియో కెమిస్ట్రీ, ఆయిల్ & గ్యాస్ సంబంధిత శాఖలు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని అన్నారు. ఆన్ లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, సాంకేతిక ఇంటర్వ్యూ, హెచ్.ఆర్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, ఎంపికైన బి.టెక్/ఎంటెక్ అభ్యర్థులకు రూ. 4.18 లక్షలు, ఎంఎస్సీ అభ్యర్థులకు రూ. 3.93 లక్షలు వార్షిక ఆదాయం లభిస్తుందని, ఎంపికైన అభ్యర్థులు చెన్నై, బెంగళూరు, ముంబై, పూణే శాఖలలో పనిచేయవలసి ఉంటుందని, అర్హత గల అభ్యర్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సతీష్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, ఆదిత్య ప్లేస్ మెంట్ విభాగ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







