ఆదిత్యలో ఘనంగా ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకలు

UPDATED 26th SEPTEMBER 2018 WEDNESDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఫార్మసీ కళాశాలలలో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్జ్వలన అనంతరం వక్తలు మాట్లాడుతూ ఫార్మసిస్ట్స్: యువర్ మెడిసిన్స్ ఎక్స్ పర్ట్ అనేది ఈ సంవత్సరం ప్రపంచ ఫార్మసిస్ట్ డే ధీమ్ అని అన్నారు. ప్రతీ రోగికి సరైన మందు తగిన మోతాదులో అందించడానికి, ప్రతీ ఒక్కరికి సరైన చికిత్స అందించడానికి ఇతర ఆరోగ్య నిపుణులతో పనిచేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేసేందుకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమం చేపట్టిందని పేర్కొన్నారు. ఫార్మసీ రంగంలో సైతం మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, ప్రతీ ఒక్కరూ సబ్జెక్టు ను ఆకళింపుచేసుకొని చదవాలని కోరారు. అనంతరం 2017-18 విద్యాసంవత్సరంలో ప్రథమ సంవత్సరం నుంచి నాల్గవ సంవత్సరం వరకు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందచేశారు. వక్తృత్వ, వ్యాసరచన, ఇ - పోస్టర్ విభాగాలలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రధమ, ద్వితీయ స్థానాలలో నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందచేశారు. అనంతరం ఫార్మసీ విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో, సూరంపాలెం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఆదిత్య ఫార్మసీ కళాశాల టి-హబ్ సిఇవో బాబ్జి నీలం, ప్రిన్సిపాల్ వై. సురేంద్రనాథ్ రెడ్డి, డాక్టర్ కె. రవిశంకర్, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us