UPDATED 10th JANUARY 2018 WEDNESDAY 5:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అథ్లెటిక్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరచి పతకాలు సాధించినట్లు ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్ యూనివర్సిటీ, వైజాగ్ లో నిర్వహించిన యువతరంగ్-2018, ఐడియల్ కాలేజ్, కాకినాడలో నిర్వహించిన యువమహోత్సవంలో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, జావలిన్ త్రో, షాట్ ఫుట్ డిస్కస్ త్రో మొదలైన అథ్లెటిక్స్ విభాగాల్లో తమ సంస్థకు చెందిన విద్యార్థులు 42 పతకాలు కైవసం చేసుకున్నారని ఆయన తెలిపారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని, విద్యార్థులకు ఆయా రంగాల్లో నిష్ణాతులైన ఫిజికల్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతోందని, అందుకే తమ సంస్థ విద్యార్థులు క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తదితరులు కోచ్ ప్రతాప్ రెడ్డి, నరేష్, వ్యాయమ అధ్యాపకులు, విజేతలను అభినందించారు.







