UPDATED 7th OCTOBER 2020 WEDNESDAY 8:00 PM
రాజానగరం (రెడ్ బీ న్యూస్): ది జ్యూరీ ఆఫ్ ఐడియల్ టీచింగ్ అవార్డు ప్రోగ్రాం-2020లో భాగంగా బెస్ట్ ఎడ్యుకేటర్ ఆఫ్ ది డికేడ్ గా స్థానిక కెఎల్ఆర్ లెనోరా దంత వైద్య కళాశాల, ఆసుపత్రి సెక్రటరీ వై. మధుసూదన్ రెడ్డి ఎంపికయ్యారు. గాంధీ జయంతి రోజున హైదరాబాదులో ట్యూటర్స్ ప్రైడ్ సంస్థ న్యాయనిర్ణేతల బృందం చేతులా మీదుగా ఈ అవార్డును ఆయన అందుకున్నారు. బోధనా పద్ధతుల్లో ఆయన ప్రదర్శించిన అత్యుత్తమ పనితీరుకు నిదర్శనంగా ఈ అవార్డును ప్రధానం చేశారు. ఈ సందర్భంగా లెనోరా దంత వైద్య కళాశాల చైర్మన్ కె. నాగమణి, డైరెక్టర్ డాక్టర్ నాగార్జునరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వ ప్రకాష్ శెట్టి, అధ్యాపక, అధ్యాపకేత సిబ్బంది ఆయనను అభినందించారు.







