UPDATED 14th APRIL 2018 SATURDAY 7:30 PM
కాకినాడ: సమాచార శాఖలో పబ్లిసిటీ అసిస్టెంట్ గా పనిచేసి ఆడియో విజువల్ సూపర్ వైజర్ గా పదోన్నతి పొందిన కె. డేవిడ్ రాజు సేవలు ప్రశంసనీయమని సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు ఎం. ఫ్రాన్సిస్ అన్నారు. స్థానిక సమాచార పౌరసంబంధాల శాఖ ఉప సంచాలకులు కార్యాలయంలో పబ్లిసిటీ అసిస్టెంట్ గా పనిచేస్తూ పదోన్నతిపై ఎ.వి. సూపర్ వైజర్ గా కృష్ణాజిల్లా మచిలీపట్నం జిల్లా పౌర సంబంధాధికారి కార్యాలయానికి వెళ్ళుతున్న డేవిడ్ రాజును శనివారం ఉప సంచాలకులు ఎం. ఫ్రాన్సిస్, డిపిఆర్వో కె. రామమోహనరావు ఎపిఆర్వోలు, కార్యాలయ సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన వీడ్కోలు సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఉప సంచాలకులు ఫ్రాన్సిస్ మాట్లాడుతూ సమాచార శాఖ ద్వారా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రచారంలో పబ్లిసిటీ అసిస్టెంటుగా విశిష్ట సేవలందించారని, ఈయన సేవలను సమాచార శాఖ ఉద్యోగులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సభకు అధ్యక్షత వహించిన జిల్లా పౌర సంబంధాధికారి కె. రామ మోహనరావు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంలో ఫొటోగ్రఫీ, ఛాయాచిత్ర ప్రదర్శనలు ఏర్పాటులో డేవిడ్ రాజు నిబద్ధతతో విధులు నిర్వర్తించేవారని, ఆడియో విజువల్ సూపర్ వైజర్ గా పదోన్నతి పొందడం పట్ల మరింత బాధ్యతగా విధులు నిర్వర్తించి సమాచార శాఖకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాక్షించారు. సన్మాన గ్రహీత డేవిడ్ రాజు మాట్లాడుతూ 2005 సంవత్సరం నుంచి తూర్పుగోదావరి జిల్లాలో పబ్లిసిటీ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నానని, తన విధి నిర్వహణలో ప్రోత్సాహం అందించిన ఉప సంచాలకులు, కార్యాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఆర్వోలు పి. రవి, కె. సరస్వతి, ఎ.వి సూపర్ వైజర్ ఇ. ధర్మరాజు, సీనియర్ అసిస్టెంట్ టి. మురళీకృష్ణ, టైపిస్టులు ఎస్.కె.బి. అహ్మద్, జి. స్వరాజ్యకుమారి, సి.హెచ్. నరేష్, కార్యాలయ సిబ్బంది కె. గోపీకృష్ణ, ఎన్. చిట్టిరాజు, ఎం. మాధవకృష్ణ, కె. లక్ష్మీకాంతం, పి. విఘ్నేశ్వరి, వై. సూరిబాబు, డి. సూర్యనారాయణ మూర్తి తదితరులు డేవిడ్ రాజును అభినందించారు.







