గైట్ లో తిప్పరామీసం చిత్రబృందం సందడి

UPDATED 29th OCTOBER 2019 TUESDAY 6:30 PM

రాజానగరం(రెడ్ బీ న్యూస్): గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో తిప్పరామీసం చిత్ర బృందం మంగళవారం సందడి చేసింది. శ్రీ విష్ణు, నిక్కీ తంబోలా జంటగా నిర్మించిన తిప్పరామీసం ప్రమోషన్ లో భాగంగా కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ కొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగిందని, ఈనెల ఎనిమిదవ తేదీన విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. సినిమాలో చాలాసార్లు మీసం తిప్పానని ఆయన తెలిపారు. హీరోయిన్ నిక్కీ తంబోలా మాట్లాడుతూ తాను రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో చదువుకున్నానని చెప్పారు. విద్యార్థినీ, విద్యార్థులు చిత్ర బృందంతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us