మర్లావలో చలివేంద్రం ఏర్పాటు

UPDATED 15th APRIL 2018 SUNDAY 7:00 PM

పెద్దాపురం: మండల పరిధిలోని మర్లావ గ్రామంలో జనసేన సేవాదళ్ ఆధ్వర్యంలో ఆదివారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని జనసేన సేవాదళ్ సభ్యుడు తమనార లక్ష్మణ దివాకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాలలో భాగంగా వేసవిని దృష్టిలో ఉంచుకుని ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు తమ పార్టీ ఆధ్వర్యంలో సేవాదళ్ బృందం పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు జి. శివ, ఎ. హరీష్, డి.వి.ఎన్. శివ, పి. శివ, జి.యేసు, నరేంద్ర, శ్యామ్, బాబీ, గుమ్మళ్ళ వెంకటేష్, చెన్నకేశ్వరుడు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us