UPDATED 10th OCTOBER 2018 WEDNESDAY 5:30 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల గ్రంధాలయ విభాగం ఆధ్వర్యంలో గ్రంధాలయ నిర్వహణలో కంప్యూటర్ రంగంలో వచ్చిన నూతన టెక్నాలజీ లైబ్రరీ ఆటోమేషన్ సాఫ్ట్ వేర్ "కోహ్"పై ఈ నెల 12వ తేదీన ఒకరోజు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలల క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఐఐటి ముంబాయి సౌజన్యంతో నిర్వహిస్తున్నఈ కార్యక్రమంలో పాల్గొనేవారు 11వతేదీ సాయంత్రం లోపు ఆన్ లైన్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని గ్రంధాలయశాఖలో పనిచేసేవారు ముఖ్యంగా ప్రభుత్వ గ్రంధాలయాలలో పనిచేసే వారికి ఈ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ఆదిత్య గ్రంధాలయ శాఖాధికారి కె. అశోక్ కుమార్ మాట్లాడుతూ దేశాన్ని డిజిటలైజషన్ చేసే కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయాల కంప్యూటీకరణకు ఉద్దేశించిన ఈ శిక్షణా కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని, ఈ సదవకాశాన్ని గ్రంధాలయశాఖ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆసక్తి గలవారు వివరాల కోసం 9848595143 నెంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు.







