UPDATED 20th FEBRUARY 2019 WEDNESDAY 6:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్(ఇండియా) స్టూడెంట్ చాఫ్టర్ ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఐటి(మద్రాస్) ప్రొఫెసర్ జి.ఎల్. సామ్యూల్ హాజరై ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ, అంకితభావం, కృషి, పట్టుదల ఆవశ్యకతలను వివరించారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, అధ్యాపక బృందం, తదితరులు అభినందించారు.







