ఓపెన్ స్కూల్ కు అపూర్వ స్పందన

UPDATED 30th SEPTEMBER 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: వివిధ కారణాలతో చదువు మధ్యలో మానేసిన యువత తమ చదువును కొనసాగించేందుకు ఓపెన్ స్కూల్ ఒక మంచి వరమని ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం రాష్ట్ర సమన్వయకర్త పి. సాయిబాబా పేర్కొన్నారు.  స్థానిక అయోధ్యరామపురం మున్సిపల్ ఉన్నత పాఠశాల అధ్యయన కేంద్రాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఓపెన్ స్కూల్ తరగతులను నిర్వహణ విధానాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా సమన్వయకర్త కె.  జనార్ధనరావుతో కలిసి రాష్ట్ర సమన్వయకర్త  పి.సాయిబాబా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రతీ ఒక్క విద్యార్థి కనీసం మరో ఐదుగురిని చేర్పించేలా కృషి చేయాలన్నారు. రెగ్యులర్ సర్టిఫికెట్ ను సమాన విలువ కలిగిన  పదో తరగతి, ఇంటర్ అభ్యాసం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందే అవకాశం ఉందన్నారు. సెలవుదినాల్లో నిర్వహిస్తున్న తరగతులకు తప్పనిసరిగా హాజరు కావడం ద్వారా వచ్చే పరీక్షల్లో సులువుగా ఉత్తీర్ణులు కావచ్చన్నారు. ఓపెన్ స్కూల్ లో ప్రవేశం పొందడానికి అక్టోబర్ 15వ తేదీ చివరి తేదీ అని తెలిపారు ఈ ఏడాది నుంచి విద్యార్థి సెల్ నెంబర్ ఆధారంగా అడ్మిషన్ల ప్రక్రియ జరగడంతో మరింత పారదర్శకతతో నిర్వహించే వీలుందన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కోఆర్డినేటర్ తాళ్ళూరి వైకుంఠం, కె. శివప్రసాద్‌, నూకరాజు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us