* లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ కరణం ప్రసాదరావు
UPDATED 26th JANAURY 2020 SUNDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): 71వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని స్థానిక బ్రౌన్ పేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ కరణం ప్రసాదరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అన్ని మతాలు, కులాలు కలుపుకుంటూ లౌకిక రాజ్యంగా ఏర్పాటు చేయడం జరిగిందని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపైన ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ కార్యదర్శి వీర రాఘవ, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు బాలం శ్రీనివాస్, ఎండి సలీం, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పిట్ట సత్యనారాయణ, మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు లింగం శివ ప్రసాద్, 7వ వార్డు మాజీ కౌన్సిలర్ జుత్తుక సుబ్బలక్ష్మి, మానవ హక్కుల సంఘం నాయకులు జుత్తుక అప్పారావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ప్రకృతి ఈశ్వరరావు, రిక్షా సంఘం కార్యదర్శి కరక మాణిక్యం, ఎస్ఎంఎస్ కన్వీనర్ బాలం హరిబాబు, డివైఎఫ్ఐ నాయకులు ఐటీ వీరబాబు, సామాజిక కార్యకర్త కరణం ఏడుకొండలు, బాలం సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.







