అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందాలి

UPDATED 16th DECEMBER 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా కృషి చేయాలని మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరావు అన్నారు. స్థానిక భీమేశ్వర లయన్స్ క్లబ్ భవనంలో కరాటేలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల అభినందన సభ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామర్లకోట మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ ఈదల ఈశ్వరకుమార్, జోన్ చైర్మన్ రాజా తదితరులు పాల్గొని పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ లో ప్రతిభ కనపరుస్తున్న విద్యార్థులు జాతీయస్థాయిలోనే కాకుండా భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయికి అర్హత సాధించాలని అన్నారు. ఈనెల తొమ్మిదిన తెనాలి, 16వ తేదీన రామచంద్రపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థులతో పాటు ఈనెల 11,12,13 తేదీల్లో విశాఖ జిల్లా భీమిలిలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో అండర్-19 బాలికల విభాగంలో ప్రతిభ కనబరిచి పతకాన్నిసాధించిన పట్టణానికి చెందిన బొడ్డు సుప్రియను ఈ సందర్భంగా అభినందించారు. లయన్స్ రీజియన్ చైర్మన్ ఈశ్వరకుమార్ జోన్ చైర్మన్ రాజా తదితరులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా కష్టాన్ని పక్కన పెట్టి విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు మార్షల్ ఆర్ట్స్ ఉచితంగా తర్ఫీదునిస్తూ విద్యార్థులను చిన్నవయస్సులోనే జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువస్తున్న కోచ్ శంకర్ కృషి అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో విజేతలకు ముఖ్య అతిధులు చేతులు మీదుగా పతకాలు, సర్టిఫికెట్లు, బ్లాక్ బెల్ట్ క్రీడాకారులు రిఫరీలు ప్రత్యేక జ్ఞాపికను అందించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కరరెడ్డి, లయన్స్ నాయకులు గిడుతూరి శ్రీనివాసరావు, ప్రముఖ న్యాయవాది రవికుమార్, కోచ్ లు లక్ష్మణ్, స్నేహ, బి. సత్యన్నారాయణ, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us