ప్రపంచ దేశాల్లో మళ్లీ ఆంక్షలు

చైనాలోని షియాన్‌లో ఇంటివద్దకే సరకులు

 ఫ్రాన్స్‌లో మాస్కు లేకపోతే జరిమానా

వాషింగ్టన్ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021‌: ఒమిక్రాన్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు ముందు జాగ్రత్తగా పౌరుల కదలికలపై మళ్లీ ఆంక్షలు విధించాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం తప్పనిసరి చేశాయి. ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 2,08,000 కొత్త కొవిడ్‌ కేసులు నమోదవడంతో 12 ఏళ్లు పైబడిన పౌరులు, పర్యాటకులు శుక్రవారం నుంచి బహిరంగ స్థలాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీన్ని ఉల్లంఘించినవారికి 135 యూరోల జరిమానా విధిస్తారు. ఫ్రాన్స్‌లో ఇప్పటికే రైళ్లు, బస్సులు, దుకాణాలు, కార్యాలయాలలో మాస్కుల ధారణ తప్పనిసరి చేశారు. చైనాలో సుదీర్ఘ లాక్‌డౌన్‌లో ఉన్న షియాన్‌ నగరంలోని కోటీ 30 లక్షల జనాభాకు రోజూ ఇంటివద్దకే నిత్యావసరాలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. చాలామంది ప్రజలు తమకు సరకులు అందలేదని సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. మెక్సికో ప్రజలకు మూడు డోసుల క్యూబా వ్యాక్సిన్‌ వేయడానికి ప్రభుత్వం అత్యవసర అనుమతి ఇచ్చింది. అమెరికాలోని లాస్‌వేగాస్‌లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా నూతన సంవత్సర వేడుకలను రద్దు చేసేది లేదని ప్రభుత్వం అంటోంది. కెనడాలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున ఆంక్షలను కఠినతరం చేశారు. క్రిస్మస్‌ సెలవుల తర్వాత విద్యార్థులు ఇంటి నుంచే ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకావాలని కొన్ని రాష్ట్రాలు ఆదేశించాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us