ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలి

UPDATED 2nd APRIL 2018 MONDAY 10:00 PM

సామర్లకోట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై మహిళా సంఘాలు అవగాహన పెంపొందించుకోవాలని స్థానిక శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ ఎం.వి.వి.ఎస్. మూర్తి  అన్నారు. జిల్లాలోని మహిళా సంఘాల ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆరో బ్యాచ్ శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో అనేక పథకాలు అమలు జరుగుతున్నాయని, మహిళా సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, మహిళా ఆరోగ్యం, మహిళా సాధికరత వంటి వివిధ అంశాలపై మూడు రోజుల పాటు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శిక్షణ పొందిన వారు వారి వారి మండలాలకు వెళ్లి గ్రామాలలోని మహిళా సంఘాలకు తిరిగి శిక్షణ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీలు బి.ఎం. సిల్వియా, కుమార్ రాజు, ఎస్.కె. మొహిద్దిన్, ఎ. గోపాలరావు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us