* జైభారత్ నేషనల్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
* అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన.. మద్దతుల వెల్లువ
* అడుగడుగునా నీరాజనం.. గాజులు గుర్తుకు ఓటేస్తామని ప్రతిన..
UPDATED 8th APRIL 2019 MONDAY 9:00 PM
పెద్దాపురం: అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడడమే తమ పార్టీ లక్ష్యమని, భవిష్యత్ తరాలు బాగు కోసం ప్రణాళికలు రచిస్తున్నామని, ఆ దిశలోనే తన ఆలోచనలు కొనసాగుతున్నాయని జైభారత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని వడ్లమూరు, పులిమేరు, దివిలి, తూర్పుపాకలు, తదితర గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డీజేసౌండ్ సిస్టంతో రోడ్‌షోలు నిర్వహిస్తూ మధ్య మధ్యలో ప్రజలతో మమేకయ్యారు. పలుచోట్ల ప్రజలు ఆయనకు మంగళహారతులు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నయ్యదొర మాట్లాడుతూ తనను ఆదరిస్తే నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని వివరించారు. ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం జైభారత్ నేషనల్ పార్టీయేనని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదేళ్లలో చేసిందేమి లేదని, అవకాశం ఇస్తే సేవకుడిలా ప్రజలకు సేవ చేస్తానని, నిత్యం నాకు ఎవరైనా ఫోన్ చేసి నేరుగా మాట్లాడవచ్చని మీకు సేవకుడిలా పని చేస్తానని, పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు. ప్రజలందరూ గాజులు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్రధ్యక్షుడు జివివి సత్యనారాయణ, కె. అబ్బాస్, దొరబాబు, సత్యశ్రీ, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.







